జగన్ ఇంగ్లిష్.. ఇన్వెస్టర్ల ముందు నవ్వులపాలు!

Tuesday, April 23, 2024

తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ప్రసంగాల్లో చిన్న తప్పు దొర్లినా, తడబాటు దొర్లినా, factual errors మాట్లాడినా వైసీపీ నాయకులు ఒక రేంజిలో ఆడేసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న పొరబాటు మీద ఎన్నెన్ని ట్రోల్స్ జరుగుతాయో.. ఎన్నెన్ని మీమ్ లు తయారుచేసి ప్రచారంలో పెడతారో లెక్కేలేదు. ఇది పెద్ద వింతేమీ కాదు. ఎంత గొప్ప నాయకులు అయినా సరే.. ప్రసంగాల ఫ్లోలో కొన్ని factuall errors పరధ్యానంలో చెప్పేయడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ప్రతి అవకాశాన్నీ వైరిపక్షాలు వాడుకోవడానికి ప్రయత్నించడం కూడా సహజం. కానీ జగన్ సంగతి ఏమిటి? factual errors సంగతి తర్వాత.. కనీసం ఇంగ్లిషు మాట్లాడేప్పుడు సవ్యంగా ఉండాలి కదా. ప్రత్యేకించి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు లాంటి అంతర్జాతీయ వేదికలమీద మాట్లాడేప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
చంద్రబాబునాయుడు సంగతి వేరు. ఆయనకు గొప్ప ఇంగ్లిషు రాదు. ఇంగ్లిషు భాష మీద చాలా కనీసమైన పట్టుతో ఆయన తనకు తోచిన రీతిలో చెప్పదలచుకున్న విషయాన్ని అవతలి వాళ్లకు చెప్పేస్తారు. వయసు రీత్యా ఆయననుంచి గొప్ప ఇంగ్లిషులో, తప్పుల్లేని ఇంగ్లిషులో వినాలని అవతలివాళ్లు కూడా ఆశించరు. ఆయన తనకు విపరీతమైన ఇంగ్లిషు భాషాజ్ఞానం ఉన్నట్టుగా కనిపించాలని, బుకాయించాలని కూడా అనుకోరు. కానీ జగన్ సంగతి వేరు. బుకాయింపు ఆయన వద్ద కూడా లేదు గానీ.. యాభయ్యేళ్ల ఈ యువ ముఖ్యమంత్రి నుంచి ఇతరు ఆశించే భాషాజ్ఞానం వేరే లెవెల్లో ఉంటుంది. పైగా ఆయన విదేశాల్లో చదువుకున్నారు. అలాంటి నేత చక్కటి ఇంగ్లిషులో మాట్లాడాలని ఇతరులు ఆశిస్తారు. ప్రపంచమంతా తెలుగువాళ్లు రాణించాలంటే.. రాష్ట్రంలోని బడుల్లో తెలుగుమీడియం అనేది ఉండనే వద్దని ఇంగ్లిషు మీడియాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఆయన. తాజాగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో ఆయన ప్రసంగంలో కొన్ని మాటలు ఇంగ్లిషులో ఆయన పట్టుపై అనుమానాలు కలిగించాయి. గ్లోబల్ వేదికగా నవ్వులపాలయ్యేలా చేశాయి.
I am.. invite you అంటూ జగన్ ఇన్వెస్టర్లను మార్చిలో జరిగే విశాఖ సదస్సుకు ఆహ్వానించారు. గ్రమెటికల్ గా ఇది తప్పు. ఏదో తెలిసీ తెలియక, ఇంగ్లిషులో మాట్లాడాలనే ఉత్సాహం తప్ప, భాష మీద పట్టులేని వాళ్లు మాట్లాడినట్టుగా ఉంటుంది ఇది. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు ఇంగ్లిషు మాట్లాడే మీమ్స్ లాగా ఉంటుంది ఇలాంటి వ్యక్తీకరణ.
అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మూడు సంవత్సరాలుగా వరుసగా ప్రథమ స్థానంలోనే ఉన్నదని ఇన్వెస్టర్లకు ముఖ్యమంత్రి జగన్ చెప్పాలనుకున్నారు. కరెక్టుగానే చెప్పారు కూడా. కానీ ఆయన ఇంగ్లిషు వాక్యాలే అంత అందంగా లేవు. consecutively for three years అంటూ ఆ విషయం జగన్ చెప్పారు. ఆ వెంటనే in a row అనే పదాలు కూడా జతకలిపారు. నిజానికి ‘‘మూడేళ్లు వరుసగా’’ సాధించాం అనడానికి ఈ రెండింటిలో ఏ ఒక్కటి ప్రయోగించినా సరిపోతుంది. రెండూ వాడితే.. తెలిసీ తెలియని ఇంగ్లిషులాగా ఉంటుంది. విదేశాల్లో చదువుకున్న జగన్ ఇలా మాట్లాడడమే తమాషా.
అయితే.. గ్లోబల్ ఇన్వెస్టర్లు హాజరైన ఇలాంటి వేదికమీద జగన్ ప్రసంగంలో భాషా పొరబాట్లు దొర్లడం పలువురికి నవ్వు తెప్పించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles