`ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి’ బృందంపై అవినాష్‌రెడ్డి అనుచరుల వీరంగం

Friday, April 19, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తున్న `ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి’ బృందంపై అక్కసుతో అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది.

శుక్రవారం సీబీఐ ఎదుట అవినాష్‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అందుకు సంబంధించిన అవినాష్‌ వాహనాన్ని కవరేజ్‌ చేస్తున్న మీడియాపై  దాడులకు పాల్పడ్డారు.  కెమెరా లాక్కొని పలు మీడియా వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.  కారును ఆపి కెమెరామెన్‌, సంబంధిత రిపోర్టర్‌పై దాడికి పాల్పడి కెమెరాను పగులగొట్టారు. అనుచిత వ్యాఖ్యాలతో దురుసుగా ప్రవర్తించారు. మరికొందరిపై అనుచితంగా ప్రవర్తించారు.

ఏబీఎన్ ప్రతినిధులు అవినాష్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా ఆయన మాట్లాడలేదు. అవినాష్ ఇంటి నుంచి బయలుదేరగా ఖైరతాబాద్ సెంటర్ వద్ద సిగ్నల్ పడడంతో ఆయన కాన్వాయ్ ఆగిపోయింది. అక్కడ ఏబీఎన్ ప్రతినిధులు అవినాష్‌కు సంబంధించిన విజువల్స్ తీస్తున్నారు. ఆ సమయంలో అవినాష్ అనుచరులు ఏబీఎన్ వాహనం వద్దకు వచ్చి బూతులు తిడుతూ కెమెరామెన్‌పై దాడి చేశారు.

కెమెరాను కిందపడేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు వారిని వారించినా వినలేదు. కొన్ని మీడియా చానల్స్ కూడా ఫాలో అవుతున్నాయని.. వాటిని వదిలేసి ఏబీఎన్ వాహనం వద్దకు వచ్చి మీకు ఇంత ఇంటరెస్టు ఎందుకని బూతులు తిడుతూ రాలేని విధంగా దుర్భాషలాడారు.

 ఈ క్రమంలో అవినాష్ పులివెందుల రౌడీలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ.. బెదిరింపులు దిగడమే కాకుండా ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డారు. అవినాష్ కాన్వాయ్‌ను అనుసరించవద్దని, వీడియోలు తీయవద్దని అడ్డుకుని వాహనాన్ని ధ్వంసం చేసి, ఏబీఎన్ ప్రతినిధులపై దాడులు చేశారు. కెమెరాలు తీసుకుపోయారు.
ఎంపి అవినాష్ అనుచరులు మీడియాపై దాడి చేయడం సరికాదని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. దానికి ఖండిస్తూ  దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులపై దాడిని బిజెపి నేత సోము వీర్రాజు ఖండించారు. ఎంపి అవినాష్ రెడ్డి అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వ పెద్దలు క్షమాపణ చెప్పించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. వార్తలు రాస్తే దాడులు చేయించడం సమంజసం కాదని హెచ్చరించారు.

మీడియాపై ఎంపీ అవినాశ్ అనుచరులు గూండాయిజానికి పాల్పడ్డారని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రేవతి మండిపడ్డారు. నిజాలను ప్రజలకు చేరే వేస్తున్న మీడియా ప్రతినిధిపై నిస్సిగ్గుగా దాడి చేయడమే కాకుండా వాహనాన్ని ధ్వంసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ధైర్యంతో ఇలాంటి దాడులకు పాల్పడ్డారో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

గౌరవనీయ పదవిలో ఉన్న సీఎం జగన్ ప్రతీసారి మీడియా ప్రతినిధులు, సంస్థలను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారని ఆమె తెలిపారు. అక్కడి నుంచే మీడియాపై అరాచకం మొదలైందని ఆమె విమర్శించారు. ఈరోజు మీడియా ప్రతినిధిపై దాడికి సీఎం జగనే కారణమని ఆమె ఆరోపించారు.

న్యూస్ కవరేజ్ చేస్తున్న మీడియాపై దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. అవినాశ్ అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక సంచలన కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం మీడియా బాధ్యతని అంటూ రాజకీయ నాయకులు ఈ రకంగా బరి తెగించడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు. దాడులతో మీడియాను అణచి వేయగలమని అనుకోవడం అవివేకమే అని ఆయన హెచ్చరించారు.

ఎక్కడో ఉన్న రాజకీయ సంస్కృతిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, వీరంగం వేయడం.. కేసీఆర్ సర్కార్ చూస్తూ ఎందుకు సహిస్తోందో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles