ఈడీ తోనే పోరుకు కాలు దువ్వుతున్న సంతోష్ రెడ్డి!

Tuesday, April 23, 2024

ఎమ్యెల్యేల కొనుగోలు కేసు నమోదు చేసి బిజెపికి ముచ్చెమటలు పట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్  అనూహ్యంగా మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ లను రంగంలోకి దింపి ఎదురు దాడికి దిగడంతో ఖంగుతిన్నారు. పైగా, కేసును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ నుండి సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడం షాక్ కు గురిచేసిన్నట్లయింది. 

ఒక విధంగా ఇటువంటి పరిణామాలకు సిద్ధంగా లేని కేసీఆర్, ఇప్పుడు ఒక వంక డివిజన్ బెంచ్ ముందు, అక్కడా విఫలమైతే సుప్రీం కోర్టు ముందుకు వెళ్లడం ద్వారా సిబిఐ ఈ కేసు చేపట్టకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అసలు నగదు లావాదేవీలు జరగని కేసులో ఈడీ ఏవిధంగా వస్తుందని అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. 

ఈ కేసులో ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్యెల్యే  పైలట్ సంతోష్ రెడ్డిని ఇప్పటికే రెండు రోజులపాటు విచారించిన ఈడీ, మరోసారి మంగళవారం విచారణకు పిలిచింది. అయితే విచారణకు హాజరుకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

పైగా, అందులో కేంద్రం, ఈడీ, ఈడీ డైరెక్టర్‌, ఈడీ హైదరాబాద్ జోన్ డైరెక్టర్‌లను రోహిత్‌రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌‌ ఆరోపించారు. మనీలాండరింగ్ కింద నోటీసులిచ్చి వేధిస్తున్నారని తెలిపారు. 

విచారణకు హాజరుకాకపోగా, తమపై రోహిత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడం పట్ల ఈడీ రగిలిపోతున్నట్లు తెలుస్తున్నది. రోహిత్‌రెడ్డి గైర్హాజరుతో తదుపరి చర్యలకు ఈడీ సిద్దమవుతోంది. వ్యక్తిగతంగా విచారణకు సహకరిస్తానంటూనే రోహిత్‌రెడ్డి డుమ్మా కొట్టారనే విమర్శలు వస్తున్నాయి.

 రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను గురువారం విచారించనున్నారు. దీంతో హైకోర్టు తీర్పు తర్వాత తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  ఆయన ఈ కేసు విషయమై తరచూ ప్రగతి భవన్ కు వెడుతూ ఉండడం, అక్కడనే న్యాయనిపుణులతో సంప్రదింపులు  జరిపి వస్తుండటం, న్యాయవాదులు  నడుచుకొంటానని మీడియాతో కూడా చెబుతూ ఉండటం గమనిస్తే కేసీఆర్ స్వయంగా ఈ కేసు పరిణామాలను పర్యవేక్షిస్తున్న ట్లు స్పష్టం అవుతుంది.

మరోవంక, నిందితుడైన నందకుమార్ ను ఈడీ రెండు రోజుల పాటు జరిపిన విచారణ మంగళవారం ముగిసింది. రెండో రోజు, దాదాపు ఐదున్నర గంటలకుపైగా అధికారులు నందకుమార్ ను ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ సందర్భంగా అతని ఆర్ధిక లావాదేవీలతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల గురించి సమాచారం సేకరించినట్లు సమాచారం. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles