జ‌గ‌న్ తో టీవీ9 ర‌జ‌నీకాంత్ `ఏకాంత’ భేటీపై దుమారం!

జ‌గ‌న్ తో టీవీ9 ర‌జ‌నీకాంత్ `ఏకాంత’ భేటీపై దుమారం!

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాజాగా టీవీ9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్  ర‌జ‌నీకాంత్ ఏకాంత భేటీ జరిపారనే కధనంపై దుమారం చెలరేగుతోంది. సాధారణంగా మీడియా ప్రతినిధులకు దూరంగా ఉండే జగన్ స్థానిక టివి9 ప్రతినిధులకు సహితం తెలియకుండా ఈ భేటీ జరపడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

 మరో ఐదు రోజులలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. స్థానికంగా వైసీపీకి అనుకూలంగా ఉండే టివి9 ప్రతినిధికి సహితం తెలియకుండా, నేరుగా తాడేపల్లి ప్యాలెస్ ప్రముఖులనుండి వచ్చిన పిలుపు మేరకు రజనీకాంత్ హడావుడిగా హైదరాబాద్ నుండి వచ్చి కలసిన్నట్లు చెబుతున్నారు.

అమ‌రావ‌తిలో ఉంటూ వైసీపీ స‌ర్కారు కోసం త‌న వ‌ళ్లు సైతం గుల్ల చేసుకుంటున్న జర్నలిస్టులు ఈ భేటీపట్ల విస్మయం వ్యక్తం చేస్తూ ఈ `ఏకాంత భేటీ’ని లీక్ చేశారని చెబుతున్నారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు నెగిటివ్ గా వార్తలను ప్రసారం చేయడం గురించి, పాదయాత్ర సందర్భంగా అధికార పక్షం అల్లర్లు, అడ్డంకులు సృష్టించేందుకు చేసే ప్రయత్నాలలో ఏ విధంగా భాగస్వామి కావాలో సమాలోచనలు జరిగిన్నట్లు కూడా చెబుతున్నారు.

తప్పుడు కధనాలు ఏవిధంగా వ్యాప్తి చేయాలో, పాదయాత్రలో ఏవిధంగా గందరగోళం సృష్టించాలో వంటి అంశాలపై ఈ సందర్భంగా ప్లాన్ లు సిద్ధం చేసుకున్నారని, అయితే అవి తాడేపల్లి ప్యాలెస్ నుండి టిడిపి వర్గాలకు లీక్ అయ్యాయని తెలుస్తున్నది. నిత్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను `ప్యాకేజి నేత’ అని నిందలు మోపి ప్రభుత్వ పెద్దలు ఈ సందర్భంగా `భారీ ప్యాకేజ్’ కూడా ఆఫర్ చేశారని వినికిడి.

టివి9 నుండి రవి ప్రకాష్ ను గెంటివేసిన తర్వాత, యాజమాన్యం స్వాధీనం చేస్తుకున్న పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల కనుసన్నలలో ఉంటూ, వారికోసమే తన ఛానల్ ను అంకితం చేయడం తెలిసిందే. ఇప్పుడు కీలకమైన ఓ జర్నలిస్ట్ ద్వారా లోకేష్ పాదయాత్రలో అల్లర్లు సృష్టించి, అపఖ్యాతిపాలు కావించేందుకు పధకాలు పన్నుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]
- Advertisement -

Latest Articles